టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. 2015లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసుపై ఈరోజు సుప్రీంకోర్టులో కదలిక వచ్చింది. 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినా లిస్టింగ్ కాలేదు. దీంతో ఆయన మరో సారి ఎర్లీ హియరింగ్ పిటిషన్ వేశారు. దీనిపై గురువారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే ధర్మాసనం విచారణ జరిపింది. సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు.
ఈ కేసులో 37సార్లు చార్జిషీటులో చంద్రబాబు పేరును ప్రస్తావించినా ముద్దాయిగా చేర్చలేదన్నారు. ఇప్పటికీ ఏ1 నుంచి ఏ5 వరకూ మాత్రవే విచారణ జరుపుతున్నారని విన్నవించారు. దీంతో సుప్రీంకోర్టు స్పందించింది. ఈ కేసును జూలై నెలలో విచారణ జరుపుతామని తెలిపింది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్ కు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా స్టీఫెన్ సన్ కు 50లక్షలు నగదు ఇస్తూ పట్టుబడ్డారు. ఆ వీడియోలు తీవ్ర కలకలం రేపాయి
Recent Random Post: