ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: చంద్రబాబు

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు జరిగిన తీరే ఇందుకు నిదర్శనం. ఎన్నికలపై సీఎం, మంత్రులు ముందే ప్రకటన ఎలా చేస్తారు? ఎస్ఈసీ ఆగమేఘాలపై ఎందుకు ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నారో చెప్పాలి.

ఎస్ఈసీ రబ్బర్ స్టాంప్ లా మారారు. సీఎం ఏం చెబితే అది చేస్తున్నారు. ఎస్ఈసీ లేదు.. కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు. ఎన్నికలపై ఫ్రెష్ నోటిఫికేషన్ ఇమ్మని అడిగాం.. అలా అయితే పోటీకి సిద్ధంగా ఉన్నాం. నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందుకే పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. ఈ నిర్ణయం బాధాకరమే అయినా ఎన్నికల బహిష్కరణ తప్పడం లేదు. పార్టీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థుల్లో బాధ, ఆవేదన ఉన్నా అర్ధం చేసుకోవాలి.


Recent Random Post: