నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? అంతే మరి. ఓ తెలుగు సినిమాలో తింగరి స్టూడెంటుని మరో స్టూడెంట్ మూసుక్కూచ్చోరా పూల చొక్కా.. అని అంటే, లెక్చర్ వచ్చి క్షమాపణ చెప్పాలని ఏడుస్తాడు బాధిత స్టూడెంట్. అలా వుంది అవ్యవహారం. సినీ విమర్శకుడు, నటుడు, దర్శకుడు కూడా అయిన కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కొన్ని రోజులపాటు ప్రాణాలతో పోరాడి తుది శ్వాస విడిచిన విషయం విదితమే.
కత్తి మహేష్ అంటే అతను నటించిన సినిమాలు, అతను దర్శకత్వం వహించిన సినిమాలు, అతని సినీ విశ్లేషణలు.. ఇవేవీ గుర్తుకు రావు. కత్తి మహేష్ అనగానే, అత్యంత జుగుప్సాకరంగా పవన్ కళ్యాణ్ మీద మాటల దాడి చేసిన వ్యక్తిగానే గుర్తుకొస్తాడు. సరే, ఆయనిప్పుడు జీవించి లేడు గనుక, ఆయన గతంలో ఎంత దారుణంగా ప్రవర్తించాడన్న చర్చ అనవసరం. కానీ, కత్తి మహేష్ మరణం పట్ల, మెగాస్టార్ చిరంజీవి.. సినీ పరిశ్రమ పెద్దగా సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేయలేదంటూ ‘కత్తి మహేష్ అభిమానులైన’ కొన్ని మీడియా సంస్థలు తెగ ఆవేదన చెందుతున్నాయి.
వీళ్ళ కారణంగానే, కత్తి మహేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అభిమానులకు విరోధిగా మారిపోయాడు. కాదు కాదు, పవన్ కళ్యాణ్ అభిమానుల ముసుగులో కొందరు పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా పవన్ కళ్యాణ్ మీద బురద చల్లేలా కత్తి మహేష్ అనే వ్యక్తికి ఎలివేషన్లు ఇచ్చారంతే. మెగాస్టార్ చిరంజీవి.. సినీ పరిశ్రమ పెద్ద అనే ట్యాగ్ తనంతట తానుగా తగిలించుకోలేదు. తాను సినీ పరిశ్రమ పెద్దనని ఎక్కడా చెప్పుకోలేదు. చిరంజీవి వద్దకు పలు రకాలైన సమస్యల పరిష్కారం కోసం సినీ ప్రముఖులు వెళుతున్నారు. తనకు చేతనైన సాయం.. అది మాట సాయమైనా, ధన రూప సాయమైనా, ఇంకో సాయమైనా చిరంజీవి చేస్తున్నారు.
అయినా, పవన్ అభిమానులు ఏదో అంటారని, కత్తి మహేష్ విషయంలో చిరంజీవి సంతాప ట్వీట్ వేయకుండా వుంటారా.? అలాగైతే, చిరంజీవి ఎలా ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 3 రాజధానుల వ్యవహారానికి మద్దతిస్తారు.? ఇంగితం లేని రాతలతో కత్తి మహేష్ మరణాన్ని సైతం, మెగా కుటుంబంపై ద్వేషం రగిలించేలా వాడుకోవడం సోకాల్డ్ దిక్కుమాలిన మీడియాకే చెల్లింది. ఇంకా నయ్యం.. సంతాపం కాదు, క్షమాపణ చెప్పాలని పైన చెప్పుకున్న పూల చొక్కా తరహా డిమాండ్ చేసెయ్యలేదు.
Recent Random Post: