మెగాస్టార్ చిరంజీవి ఎక్కువ బ్రేక్ తీసుకోకుండా తన నెక్స్ట్ చిత్రం మొదలుపెట్టేశాడు. మలయాళ సూపర్ హిట్ లూసిఫెర్ ను రీమేక్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు నుండి చిరు 153వ చిత్ర షూటింగ్ మొదలైంది.
తొలి రోజే భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేసాడు దర్శకుడు. తమిళ సినిమాలకు పనిచేసే స్టన్ సిల్వా ఈ చిత్రానికి యాక్షన్ పార్ట్ ను అందిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ ఇప్పటికే సంగీత దర్శకుడు అన్న విషయం అధికారికంగా వెల్లడైంది. థమన్ రెండు సాంగ్స్ ను పూర్తి చేసాడు కూడా.
ఇక ఆచార్య చిత్రానికి పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. నిరవ్ షా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని చిరు భావిస్తున్నాడు.
Recent Random Post: