తెలంగాణ కేబినేట్ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. అయితే ఉద్యోగాల భర్తి మరియు శాఖల వారిగా ఉన్న ఖాళీలను గుర్తించడంతో పాటు కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు గాను నేడు రాష్ట్ర కేబినేట్ మళ్లీ భేటీ కాబోతున్నారు. నిన్నటి కేబినేట్ లో మున్సిపాలిటీల్లో అభివృద్ది కోసం ల్యాండ్ పూలింగ్ పద్దతిలో లే అవుట్లను అభివృద్ది చేయాలి. తద్వార మున్సిపాలిటీ లు ఆదాయంను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ మరియు రెసిడెన్సీ పాఠశాల్లో స్థానికులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ నిర్ణయాలను తీసుకున్నారు.
వరుసగా రెండవ రోజు రాష్ట్ర కేబినేట్ భేటీ జరుగబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. చాలా రోజులుగా ఉద్యోగ నియామక పక్రయలు నిలిచి పోయాయి. అనేక కారణాలు చెబుతూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్న రాష్ట్ర కేబినేట్ మాత్రం నేడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు. నేడు పలు అంశాలపై చర్చించి పలు నిర్ణయాలను తీసుకోబోతున్నారు. ఉద్యోగ భర్తీతో పాటు ఇతర విషయాలపై కూడా కేబినేట్ లో చర్చించబోతున్నారని చెబుతున్నారు. అన్ని రకాల పోస్టులను గుర్తించి నియామకం ను చేపట్టాలని నిర్ణయించారు.
Recent Random Post: