తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ శనివారం ఉదయం 9.30 లకు ఏపీ ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావుకు కాల్ చేశారు. ఈ సందర్బంగా ఉప్పల ప్రసాదరావు అవలంభిస్తున్న వ్యవసాయ విధానాలను గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. సీడ్రిల్ పద్దతిలో ప్రసాదరావు సన్నరకం వరి సాగు చేశాడు. 40 నుండి45 బస్తాలు దిగుబడి సాధించడంతో అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఆయన 35 ఎకరాల్లో సీడ్రిల్ పద్దతిలో వరి సాగు చేసి మంచి పంటను పొందాడు. అందుకే ఆయనకు కేసీఆర్ ప్రశంసలు దక్కాయి.
త్వరలో తెలంగాణకు మీరు రావాలంటూ రైతును కేసీఆర్ కోరాడట. కారు పంపిస్తాను మీరు తెలంగాణకు వచ్చి మా వ్యవసాయ పద్దతులు పరిశీలించాలి. అలాగే ఒక పూట భోజనం కూడా మా వద్ద చేయాలని సీఎం కోరడంతో ప్రసాదరావు ఆనందానికి అవదులు లేవు. ఆయన కేసీఆర్ ఆహ్వానంను మన్నించి తెలంగాణకు వచ్చేందుకు ఓకే చెప్పాడట. కేసీఆర్ తో మాట్లాడిన విషయాన్ని ఉప్పల ప్రసాదరావు మీడియా ముందు చెప్పాడు. కేసీఆర్ తో మాట్లాడిన మాటలను కూడా వినిపించారు.
Recent Random Post: