హైదరాబాద్ పై సీజేఐగా జస్టిస్ ఎన్వీ.రమణకు అవ్యాజమైన ప్రేమ, అభిమానం ఉంది కాబట్టే కొన్నాళ్లుగా హైకోర్టు బెంచిల సమస్య పరిష్కరించారని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘ఉమ్మడి హైకోర్టు విడిపోయాక బెంచీల సంఖ్య పెంపుపై గతంలో కేంద్రానికి, ప్రధాని మోదీకి లేఖ రాశాను. కానీ.. ఆ అంశం పెండింగ్ లోనే ఉండిపోయింది’.
‘సీజేఐగా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాక సమస్యను త్వరితగతిన పరిష్కరించారు. 24గా ఉన్న బెంచీల సంఖ్యను 42కు పెంచేలా కృషి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తరపున జస్టిస్ ఎన్వీ రమణకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. బెంచీల సంఖ్యకు అనుగుణంగా 885 అదనపు పోస్టులను కూడా హైకోర్టుకు కేటాయించాం. రాష్ట్ర న్యాయ వ్యవస్థ, పరిపాలనా విభాగం పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని సీఎం అన్నారు.
Recent Random Post: