ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతుందట..ఎవరు చెప్పారంటే!


ఏపీలో కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ కూడా కరోనా కంట్రోల్ అవ్వడం లేదు. అయితే ఏపీలో భారీగా కేసులు నమోదు కావడానికి మరో కారణం .. ఏపీలో దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కరోనా టెస్టులు నిర్వహిస్తుంది. అందుకే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి అని ప్రభుత్వం చెప్తుంది. ప్రతిరోజూ కూడా భారీగా కేసులు నమోదు అవుతుండటంతో అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కొవిడ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి శుభవార్త చెప్పారు.
ప్టెంబర్ రెండో వారం నాటికి ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంటువ్యాధుల నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఇన్ఫెక్షన్ రేటు తదితర అంశాలను పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన ఎపిడెమాలజిస్ట్ లు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే చాలని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఆగస్టు 21 నుంచి కర్నూలు తూ.గో జిల్లాల్లో సెప్టెంబర్ 4 నుంచి గుంటూరు కృష్ణా అనంతపురం చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో తగ్గుముఖం పట్టనున్నట్లు తెలిపారు. మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుతుందని కొవిడ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్రెడ్డి చెప్పారు. ఎక్కువ పరీక్షలు చేయడం ఎక్కువ మందిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడం వల్ల మరణాల నియంత్రణ సాధ్యమవుతుందని ఎపిడెమాలజిస్ట్లు అంటున్నారు. మరోవైపు శనివారం నుంచి సిరోసర్విలేన్స్ భారీగా మొదలు కానున్నట్లు కోవిడ్ 19 ఏపీ కమాండ్ కంట్రోల్ రూమ్ స్పెషలాఫీసర్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.


Recent Random Post:

Allu Arjun Speech | Pushpa 2 Trailer Launch Event | Rashmika | Sukumar | Fahadh Faasil | DSP

November 17, 2024

Allu Arjun Speech | Pushpa 2 Trailer Launch Event | Rashmika | Sukumar | Fahadh Faasil | DSP