పవన్‌ క్రిష్‌ మూవీ కోసం ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌

పవన్‌ కళ్యాణ్‌ క్రిష్‌ ల కాంబినేషన్ లో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ను భారీ ఎత్తున దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా కు ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరున్న లక్ష్మీకాంత్‌ చెన్న సెకండ్ యూనిట్‌ కు దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడు. సినిమాలోని కొన్ని సన్నివేశాలకు క్రిష్‌ సలహాలు సూచనల మేరకు ఈయన మేకింగ్‌ చూసుకుంటాడు. ప్రస్తుతం ఈయన సొంతంగా దర్శకత్వం వహిస్తున్న కమిట్‌మెంట్‌ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది.

పలు భాషల్లో సినిమాలు చేసిన లక్ష్మికాంత్ ఈ సినిమా స్క్రిప్ట్‌ విషయమై కూడా క్రిష్‌ తో సుదీర్ఘ కాలంగా చర్చలు జరిపాడు. ఇటీవల ఆయన తన కమిట్‌మెంట్ సినిమా కోసం కాస్త గ్యాప్‌ ఇచ్చాడు. మళ్లీ క్రిష్ తో జత కట్టి పవన్‌ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమ సారధి స్టూడియోలో వేసిన సెట్టింగ్‌ లో షూట్‌ చేస్తున్నారు. పవన్‌ దొంగగా కనిపించబోతున్న ఈ సినిమా ను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. శివ రాత్రికి టైటిల్‌ ను రివీల్‌ చేసి ఫస్ట్‌ లుక్‌ ఇవ్వబోతున్నారు.


Recent Random Post: