డీఎంకే మ్యానిఫెస్టో..! అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపు

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ప్రజలకు హామీలు ఇస్తూ పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ తమ పార్టీ మ్యానిఫెస్టోను రిలీజ్ చేశారు. శనివారం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఐదు వందలకు పైగా హామీలను ప్రజల ముందుంచారు. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. అధికారంలోకి వస్తే.. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలు తగ్గిస్తామన్నారు. కార్మికులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

డీఎంకే మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యాంశాలు..
హిందూ దేవాలయాల పునరుద్ధరణకు వెయ్యి కోట్లు
మసీదులు, చర్చిల పునరుద్ధరణకు రూ.200 కోట్లు
అన్నాడీఎంకే మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు
లీటర్‌ పెట్రోల్‌పై 5, డీజిల్‌పై 4, పాలపై 3 తగ్గింపు
పెంచిన ఆస్తిపన్నును రద్దు చేస్తాం
వంటగ్యాస్‌పై సిలిండర్‌కు 100 సబ్సిడీ
జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్
తమిళనాడులో నీట్ పరీక్షను రద్దు
కోయంబత్తూరు సహాఇతర ప్రధాన పట్టణాల్లో మెట్రోరైలు ప్రాజెక్టు
యాత్రా స్థలాలకు వెళ్లాలనుకునే లక్ష మందికి రూ. 25 వేలు
శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇచ్చే దిశగా ప్రయత్నాలు
ప్రభుత్వ ఉద్యోగాల్లో 40శాతం మహిళలకు అవకాశం
ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాది పాటు మెటర్నటీ లీవులు
తమిళనాడు వ్యాప్తంగా కలైంజ్ఙర్ క్యాంటీన్లు
కరోనాతో నష్టపోయిన బియ్యం కార్డుదారులకు రూ.4వేల సాయం


Recent Random Post: