సినిమాల్లో ఆఫర్ల కోసం తిరుగుతున్న వారికి ఒక్కసారే పెద్ద దర్శకుడి నుండి లేదా పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుండి కాల్ వస్తే ఖచ్చితంగా నిజం కాదని అనుకుంటారు. నాకు అత పెద్ద ఆఫర్ ఏం వస్తుంది.. ఏదో ఫ్రాంక్ కాల్ అయ్యి ఉంటుందని అనుకుంటూ ఉంటారు. అలా కొందరు నిజంగా ఆఫర్లు వచ్చినా కూడా కోల్పోయిన సందర్బాలు ఉండే ఉంటాయి. తాజాగా తమిళ ముద్దుగుమ్మ దుషారా విజయన్ కు అలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఫ్యాషన్ డిజైనర్ అయిన దుషారా ఓ చిన్న సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత పెద్దగా ఆఫర్లు వచ్చిందే లేదు. అలాంటి దుషారాకు కబాలి వంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రంజిత్ పా ఆఫీస్ నుండి కాల్ అంటే ఖచ్చితంగా నమ్మశక్యంగా ఉండదు. నిజంగా కాల్ వచ్చినా కూడా ఫ్రాంక్ అనుకుని దుషారా ఫోన్ కాల్ కు స్పందించలేదు. మళ్లీ రెండు రోజుల తర్వాత కాల్ వస్తే వెళ్లింది. అలా వెళ్లగా దక్కిన మూవీనే సార్పట్ట. ఆర్యకు జోడీగా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
దుషారా విజయన్ నటిగా కెరీర్ కొనసాగించాలని ఉన్నా కూడా ఆఫర్లు రాక పోవడంతో నిరుత్సాహంగా ఉన్న సమయంలో రంజిత్ పా ఆఫీస్ నుండి అంటూ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ లో మాట్లాడిన వ్యక్తి మీరు రంజిత్ పా తీయబోతున్న సినిమాలో నటించేందుకు ఆడిషన్స్ ఇవ్వాల్సి ఉంది రండీ అంటూ పిలిచారు. ఆ సమయంలో నేను నమ్మలేదు.. ఫ్రాంక్ అని వెళ్లలేదు. ఆ తర్వాత రెండు రోజులకు మళ్లీ రంజిత్ సర్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. ఏమ్మా.. అంత పొగరు ఎందుకు నీకు సర్ ఆఫీస్ నుండి అంటూ చెప్పినా కూడా నువ్వు పట్టించుకోకుండా రాలేదు. ఎంత మంది ఇలాంటి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారో తెలుసా అంటూ అవతలి వ్యక్తి కాస్త సీరియస్ గానే అరిచాడు. దాంతో నేను వెంటనే రంజిత్ సర్ ఆఫీస్ కు వెళ్లాను.. అలా అలా నాకు ఆఫర్ వచ్చిందని దుషారా చెప్పుకొచ్చింది.
దిండుగల్ జిల్లా కన్యాపురం అనే చిన్న గ్రామానికి చెందిన ఈమె ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలో అనూహ్యంగా నటిగా ఆఫర్ వచ్చింది. సార్పట్ట సినిమాకు వచ్చిన అవకాశంను నూటికి నూరు శాతం నటిగా నిరూపించుకుంది. ఈమెకు మంచి భవిష్యత్తు ఉంది అంటూ నెటిజన్స్ మాట్లాడుకునేలా చేసింది. మొత్తానికి సార్పట్టలో హీరో ఆర్యతో పాటు ఈమె పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఇక ముందు ముందు ఈమెకు అన్ని వరుస సినిమాలు ఖాయం అంటున్నారు. సినిమాలో డీ గ్లామర్ గా కనిపించిన దుషారా మేకప్ లో మంచి అందంగానే కనిపిస్తుంది. కాస్త ఎక్స్ పోజింగ్ చేస్తే స్టార్ హీరోయిన్ గా కూడా గెటిన్ అయ్యే అవకాశం ఉంది అంటూ తమిళ మీడియా వర్గాల వారు మరియు సినీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని సినిమాల కోసం చర్చలు జరుపుతున్నట్లుగా చెప్పుకొచ్చిన దుషారా అతి త్వరలోనే కొత్త సినిమా ప్రకటన చేస్తానంటూ చెప్పుకొచ్చింది. పెద్ద సినిమా ల్లో కూడా ఆపర్లు వస్తున్నాయని తాజా ఇంటర్వ్యూలో ఈమె చెప్పుకొచ్చింది. రెండవ సారి వచ్చిన కాల్ ను కూడా ఫ్రాంక్ అంటూ వదిలేసి ఉంటే చాలా నష్టపోయేది ఈమె. అదృష్టం అనేది ఒక్కసారే తలుపు తడుతుందని అంటారు. కాని ఈమెకు రెండవ సారి కూడా తలుపు తట్టడం.. అప్పుడు ఆమె మేల్కుని కమిట్ అవ్వడం వల్ల స్టార్ గా ఎదిగే అవకాశంను దక్కించుకుంది.
Recent Random Post: