సరదాగా సాగిన #EMK కర్టన్‌ రైజింగ్‌ షో

Share

గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్‌ గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు కర్టన్‌ రైజింగ్ షో రామ్‌ చరణ్‌ గెస్ట్‌ గా సాగింది. రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్ ల మద్య సాగిన ఆసక్తికర చర్చ మరియు ఇద్దరి మద్య సరదా సంభాషణలు ఇంకా గేమ్ అంతా కలిపి సరదాగా సాగింది. ఎన్టీఆర్ చాలా హుందాగా గేమ్‌ ను నడుపగలడు అనే విషయం మొదటి ఎపిసోడ్‌ తోనే క్లారిటీ వచ్చేసింది.

షో లో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు పలు సందర్బాల్లో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా గురించి మాట్లాడటంతో పాటు ఇంకా పలు విషయాలను వారు చర్చించుకున్నారు. చిరంజీవి.. పవన్ కళ్యాణ్‌ మొదలుకుని ఎంతో మంది గురించిన విషయాలను వీరిద్దరు సరదాగా ముచ్చటించుకున్నారు. మొత్తానికి ఎవరు మీలో కోటీశ్వరులు షో మొదటి ఎపిసోడ్‌ ఆధ్యంతం నవ్వులు పూయించడంతో పాటు ఆసక్తిగా సాగింది అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ ఈ షో ను రాక్ చేయబోతున్నాడు అంటూ మరోసారి నిరూపితం అయ్యింది.


Recent Random Post: