ఎప్పటికప్పుడు తనలోని నటనని మెరుగుపరుచుకుంటూ, తన కంటూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న టాప్ హీరోయిన్ సమంత. ఆ తర్వాత అక్కినేని వారి కోడలైంది. నటిగానే కాకూండా పలు విషయాల్లో యాక్టివ్ గా ఉంటూ ఎంతో మోటివేట్ చేసే సమంత తనలోని భయం వలెనే తాను ఈ స్థానానికి రాగలిగిందంటోంది.
నటిగా ఇన్నేళ్ల సక్సెసఫుల్ కెరీర్లో మీలో ఇంకా భయాలేమన్నా ఉన్నాయా ఆంటీ ఉన్నాయంటోంది సమంత. ‘ భయాన్ని చూసి డిప్రెస్ అవ్వనని, భయాన్ని ఎక్కువగా ఇష్టపడతానని అంటోంది. సవాల్ తో కూడిన పాత్రలకే ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నాను. అలాంటప్పుడు వచ్చే పాత్రని వినగానే నాలో ఈ పాత్ర చేయగలనా? లేదా?. అప్పుడే ఆ పాత్రని మరింత జాగ్రత్తగా, ఎంతో ఫోకస్డ్ గా చేయగలను. ఈ మధ్య కాలంలో చేసిన అన్ని సినిమాల పరంగా నాకు అంత పేరు రావడానికి కారణం ఆ భయమే.. నటిగా భయాలు ఉండడం మనల్ని మెరుగుపరుస్తుందని’ సమంత అంటోంది.
ఇప్పటి వరకూ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన సమంత మొదటి సారి ఓటిటిలో రిలీజ్ కానున్న ‘ది ఫ్యామిలీ మాన్ 2’ సీరీస్ లో కూడా నటించింది. తన బాటలో ఎందరో హీరోయిన్స్ ఓటిటి కంటెంట్ కి సైన్ చేస్తున్నారు.
Recent Random Post: