సెకండ్ వేవ్ ప్రభావం సినీపరిశ్రమలపై తీవ్రంగా పడింది. ఎవరికీ పని లేకుండా పోయింది. క్రైసిస్ ముగిసేవరకూ ఎవరికి వారు ఇండ్లలోనే ఉండాల్సిన సన్నివేశం ఉంది. అయితే ఇలా ఎంతకాలం ఉండగలరు. దీంతో చాలామంది నైరాశ్యంలో ఉన్నారు. ఎవరికి వారు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది.
ఇక కుమారి హెబ్బా పటేల్ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ భామకు ఇటీవల అవకాశాలు తగ్గాయి. కెరీర్ పరంగా ఇంతకుముందు ఉన్నంత స్పీడ్ అయితే లేదు. క్రైసిస్ వల్ల ఉన్న షూటింగులు కూడా ఆగిపోయాయి. దీంతో ఇదిగో ఇలా ఇంట్లోనే టైమ్ పాస్ చేస్తోంది. తీరిక సమయాల్లో ఇన్ స్టాలో ఫోటోషూట్లను షేర్ చేస్తోంది.
తాజాగా బ్లాక్ శారీ ఆరెంజ్ జాకెట్ తో హెబ్బా సాధారణ గృహిణి అవతారం ఎత్తింది. రెగ్యులర్ గ్లామరస్ లుక్ తో పోలిస్తే ఇది పూర్తిగా విభిన్నమైనది. నల్ల చీరకు కాంబినేషన్ గా మెడలో నల్ల పూసలు.. నలుపు రంగు గాజుల్ని హెబ్బా ధరించింది. ఈ ఫోటోకి “మూడ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది ఇయర్.. #2021“ అనే క్యాప్షన్ ని షేర్ చేసింది.
`కుమారి 21 ఎఫ్` లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా అరడజను సినిమాలకు సంతకాలు చేసిన హెబ్బా ఇటీవలే నితిన్ భీష్మలో అతిథిగా మెరిసింది. రామ్ రెడ్ లోనూ దించక్ సాంగ్ లో నర్తించింది. 2021లోనే `ఒదేలా రైల్వేస్టేషన్`.. `తెలిసినవాళ్లు` అనే రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాల్లో హెబ్బా వరుస ఫోటోషూట్లు అభిమానుల్లో వైరల్ అవుతున్నాయి.
Recent Random Post: