ప్రఖ్యాత హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 జాబితాలో 3 వ స్థానంలో నిలిచిన రామ్ పోతినేని ఒక స్థానం ఎగబాకి 2020 జాబితాలో 2 వ స్థానంలో నిలిచాడు.
రామ్ తన చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుంచి మారి ఇప్పుడు టోన్డ్ మజిల్స్ తో మ్యాకో మ్యాన్ గా మారిన సంగతి తెలిసిందే. అతడు నటించిన గత రెండు చిత్రాలు ఇస్మార్ట్ శంకర్ – రెడ్ రెండిటిలో లుక్ పరంగా వైవిధ్యంగా కనిపించాడు. యువతరంలో అతడికి మరింత పాపులారిటీ పెంచిన ఎలిమెంట్ ఇది.
2020 లో కొత్త రిలీజ్ లేకున్నా రామ్ టాప్ ర్యాంక్ కి స్టిక్ అయ్యాడు. యువతరంలో క్రేజు ఏమాత్రం తగ్గలేదనడానికి తాజాగా అతడు సాధించిన ర్యాంక్ ఒక నిదర్శనం. తమిళ స్టార్ డైరక్టర్ లింగుసామి దర్శకత్వంలో రాపో 19 త్వరలో ప్రారంభం కానుంది. తదుపరి మురుగదాస్ దర్శకత్వంలోనూ నటించేందుకు రామ్ ప్రయత్నాల్లో ఉన్నారు.
Recent Random Post: