ఇలియానా సౌత్ ఇండియాను కొన్నేళ్ల క్రితం ఒక ఊపు ఊపింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వరసగా తెలుగులో టాప్ స్టార్లతో సినిమాలు చేసిన ఇలియానా నెమ్మదిగా బాలీవుడ్ వైపు మళ్లింది. అక్కడ కొన్ని సినిమాల్లో మెరిసింది. అయితే ప్రస్తుతం అమ్మడికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు.
ఆ మధ్య హాట్ ఫోటోషూట్లతో ఫాలోయర్స్ ను రెచ్చగొట్టింది కానీ దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉన్నట్లు లేదు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఇలియానా తన ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకుంది. తనకు చిన్నప్పటి నుండే బాడీ షేమింగ్ ప్రాబ్లెమ్ ను ఎదుర్కొన్నానని తెలిపింది.
నా పిరుదుల సైజ్ దగ్గరనుండి అన్ని రకాలుగా బాడీ షేమింగ్ సమస్యను ఫేస్ చేసానని, మహిళలకు హార్మోన్ల సమస్య వల్ల బాడీ తీరు మారుతూ ఉంటుంది. అంతే కానీ దాని వల్ల బాడీ షేమింగ్ చేయాలి అనుకోవడం మూర్ఖత్వం. ఈ విమర్శల కారణంగా నాలో ఏదైనా లోపం ఉందా అని డాక్టర్ల వద్దకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి అని ఇలియానా చెప్పుకొచ్చింది.
Recent Random Post: