నిత్యం భారత్ పై విమర్శలు చేసే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి భారత్ పై ప్రశంసలు కురిపించారు. ‘స్వతంత్ర విదేశీ విధానాన్ని పాటిస్తున్న భారత్ ను అభినందిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ లోని ఖైబర్-పఖ్తూన్ ఖ్వా ప్రావిన్సులోని ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకోవడం మెచ్చుకోదగినదని అన్నారు. క్వాడ్ కూటమిలో భాగస్వామిగా ఉన్నా భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. నేను కూడా ఎవరికీ తల వంచను. నా దేశాన్ని కూడా వంచనివ్వను అని అన్నారు.
అయితే.. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వివాదాస్పద అంశాలను బహిరంగ ర్యాలీల్లో చర్చించకూడదనే నియమాల్ని ఇమ్రాన్ ఖాన్ విడిచిపెట్టారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా పాకిస్థాన్ మద్దతు ఇవ్వాలని యూరోపియన్ యూనియన్ కోరినా ఇమ్రాన్ కాదన్నారు. దీని వల్ల పాకిస్థాన్ ఒరిగేదేమీ లేదని అన్నారు. పాక్ ప్రతిపక్షాలు పార్లమెంట్ లో ఇమ్రాన్ ఖాన్ క వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ప్రజల మద్దతు కోసం ఆయన ఈ ర్యాలీలు చేస్తున్నారు.
Recent Random Post: