అందం ఆందోళనలో అసలేమైంది?

అలా ఏదో ఆలోచిస్తూ ఉంది జాన్వీ. భృకుటిని ముడివేసి సుధీర్ఘంగా ఏం ఆలోచిస్తోంది అంతగా..! ఏదో యథాలాపంగా అలా కూచుని ఆలోచిస్తోంది? ఇంతకీ ఏమై ఉంటుందో!

కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్న జాన్వీ కపూర్ మరోవైపు వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ సోషల్ మీడియాల్లో అసాధారణ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఇటీవల మాల్దీవుల నుంచి బికినీ ఫోటోలను షేర్ చేసి అగ్గి రాజేసింది. ఆ తర్వాత మనీష్ మల్హోత్రా డిజైనర్ దుస్తుల ప్రదర్శనతో ఆకట్టుకుంది. వరుస ఫోటోషూట్లతో ఇటీవల జాన్వీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫ్యాన్స్ లోకి ఇవన్నీ వైరల్ గా దూసుకెళుతున్నాయి.

తాజాగా జాన్వీ కపూర్ ట్రెడిషనల్ లుక్ కి హాటెనెస్ ని జోడించి సరికొత్త ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ అండ్ ప్రింటెడ్ డిజైనర్ లెహెంగా ధరించి ముగ్ధమనోహర రూపంతో కవ్విస్తోంది. అలా కురులను ఆరబోసి.. ఎద సొంపుల్ని ఎలివేట్ చేసిన తీరు మతులు చెడగొడుతోంది. ఏదో ఆలోచిస్తూ జాన్వీ అలా కూచుని ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. జాన్వీ ఏంటీ అశోకవనంలో సీతలా కూచుంది! అంటూ అభిమానులు కాస్త వ్యంగ్యంగానే స్పందించడం ఆశ్చర్యపరుస్తోంది.


Recent Random Post: