ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. ఇంతటి వైసీపీ హోరులో కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ గెలిచింది. పట్టణంలో ఉన్న 36 వార్డుల్లో టీడీపీకి 18 స్థానాలు వస్తే.. వైసీపీ 16 స్థానాల్లో గిలిచాయి. ఒక ప్రాంతంలో సీపీఐ, మరోచోట ఇండిపెండెంట్ గెలిచారు. ఇది తాడిపత్రి ప్రజల విజయమని ప్రభాకర్ రెడ్డి అన్నారు. సేవ్ తాడిపత్రి నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు.
ప్రస్తుతం గెలిచిన టీడీపీ అభ్యర్ధులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్ నిర్వహిస్తున్నారు. చైర్మన్ ఎన్నిక రోజున వీరితో కలిసి తాడిపత్రికి వెళ్లలనే యోచనలో ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. దీంతో తాడిపత్రి మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద రాయలసీమలో మాత్రమే టీడీపీ గెలుచుకున్న రెండు స్థానాలు ఉన్నాయి. ఒకటి తాడిపత్రి కాగా.. రెండో పట్టణం కడప జిల్లాలోని మైదకూరు.
Recent Random Post: