JD చక్రవర్తి వ్యాఖ్యలు వైరల్: టాలీవుడ్ కాస్టింగ్‌పై క్లారిటీ

Share


టాలీవుడ్‌లో స్థానిక ఆర్టిస్టులను పక్కన పెట్టి ఇతర భాషలకు చెందిన నటీనటులకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే కోట శ్రీనివాసరావు వంటి సీనియర్ నటులు బహిరంగంగానే స్పందించారు. ప్రకాష్ రాజ్ వంటి ఇతర భాషా నటుల ఎంపికపై కూడా పలు విమర్శలు వినిపించాయి. తాజాగా ఇదే విషయంపై నటుడు JD Chakravarthy ఆసక్తికరంగా స్పందించారు.

తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న గాయపడ్డ సింహం సినిమాలో నటించిన జేడీ చక్రవర్తి, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్‌లో స్థానిక నటులను పక్కన పెట్టి ఇతర భాషా నటులను తీసుకుంటున్నారనే ప్రశ్న ఎదురైంది.

దీనిపై స్పందించిన జేడీ చక్రవర్తి, “తెలుగు ఆర్టిస్టులను పక్కన పెట్టి ఇతర భాషా నటులను తీసుకుంటున్నారు అనేది సరైన అభిప్రాయం కాదు. చాలా సార్లు మమ్మల్ని ముందుగా సంప్రదించినప్పటికీ, మేమే కొన్ని కారణాల వల్ల నో చెప్పి ఉండొచ్చు. లేదా కొన్ని పాత్రలకు సరైన ఫిట్ ఇతర భాషా నటులే అయ్యుండొచ్చు. ఇది పూర్తిగా క్యారెక్టర్ అవసరంపై ఆధారపడి ఉంటుంది” అని స్పష్టం చేశారు.

అలాగే థియేటర్లను “టెంపుల్స్” అని పిలవడంపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ సెటైర్లు వేశారు. “థియేటర్ టెంపుల్ అయితే అక్కడ స్నానం చేస్తారా? గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి సినిమా చూడటానికి వెళతారా? టెంపుల్‌లో ఇవన్నీ చేస్తారా? థియేటర్ అనేది క్రియేటివ్ స్పేస్ మాత్రమే” అని వ్యాఖ్యానించారు.

జేడీ చక్రవర్తి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ ట్రెండ్స్‌పై మరోసారి చర్చను రేపుతున్నాయి.


Recent Random Post: