ఎన్టీఆర్ – బుచ్చిబాబు మూవీపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత మూడేళ్లుగా ఏ సినిమా అంగీకరించలేదు. తన పూర్తి టైమ్ ని జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్ ఆర్ ఆర్` కోసం కేటాయించారు. దాదాపు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మూడేళ్లు పని చేశారు. అయితే తాజాగా ఈ మూవీ మార్చి 25న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం కావడంతో తన తదుపరి చిత్రాల కోసం టైమ్ కేటాయించడం మొదలుపెట్టారు ఎన్టీఆర్. ఇప్పటికే రామ్ చరణ్ .. `ఆచార్య` చిత్రాన్ని పూర్తి చేసి శంకర్ సినిమాకు వెళ్లిపోయారు.

ఎన్టీఆర్ మాత్రం `ఆర్ ఆర్ ఆర్` తరువాతే మరో సినిమా అంటూ డేట్స్ మొత్తం ఈ సినిమాకే కేటాయించేశారు. తాజాగా ఆయన కూడా తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. `ఆర్ ఆర్ ఆర్` తరువాత ఎన్టీఆర్ .. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ భారీ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. యువ కళా సుధ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై సుధాకర్ మిక్కిలినేని నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. `ఆచార్య` రిలీజ్ కి డేట్ ఫిక్స్ కావడంతో కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయడానికి రెడీ అయిపోతున్నారు.

ఈ మూవీ తరువాత `ఉప్పెన` ఫేమ్ బుచ్చి బాబు సాన డైరెక్షన్ లో ఓ భారీ చిత్రానికి ఎన్టీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీమేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త తాజాగా బయటికి వచ్చింది. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో ఎన్టీఆర్ అథ్లెట్ గా కనిపిస్తారని పారా ఒలిపింక్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిసింది.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మేకోవర్ సరికొత్తగా వుంటుందని ఆయన నటించిన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుందని చెబుతున్నారు. `ఉప్పెన` బ్లాక్ బస్టర్ కావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన బుచ్చిబాబు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ కోసం ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ . ఆర్ . రెహమాన్ సంప్రదించారని ఈ ప్రాజెక్ట్ కి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని తీసుకురావాలన్న ప్లాన్ లో భాగంగా ఏ.ఆర్. రెహమాన్ని దర్శకుడు ఇటీవల సంప్రదించారని తెలిసింది..

అయితే అతని నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రాలేదని త్వరలోనే రెహమాన్ నుంచి రిప్లై వచ్చే అవకాశం వుందని చెబుతున్నారు. ఇప్పటికే తెలుగు నుంచి ఆఫర్లు పెరుగుతుండటంతో రెహమాన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? లేక `సైరా నరసింహారెడ్డి`కి హ్యాండిచ్చినట్టే హ్యాండిస్తాడా తెలియాలంటే వేచి చూడాల్సిందే అంటున్నారు టాలీవుడ్ జనం.


Recent Random Post: