ఎందుకు ఓడాం? ఏం చేద్దాం? పార్టీ నాయకులతో కమల్‌ చర్చలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యుం పార్టీ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని ఆ పార్టీ నాయకులు బలంగా చెప్పుకొచ్చారు. రాజకీయ విశ్లేషకులు సైతం పాతిక సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని అనూహ్యంగా కమల్‌ పార్టీ కనీసం ఒక్కటి అంటే ఒక్క స్థానంను కూడా దక్కించుకోలేక పోయింది. దానికి తోడు ఆ పార్టీకి వచ్చిన ఓట్ల సంఖ్య కూడా మరీ దారుణం అంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు.

ఈ సమయంలో పార్టీ నాయకులతో కమల్‌ భేటీ అయ్యాడు. అసలు పార్టీకి తక్కువ ఓట్లు రావడంకు కారణం ఏంటీ, ఎందుకు ఓడి పోయాం, ముందు ముందు ఏం చేద్దాం అనే విషయాలను చర్చించారు. పార్టీ ముఖ్య నాయకుల్లో పలువురు సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయంను వ్యక్తం చేశారట. ఇక కమల్‌ పార్టీలో కీలక మార్పులు చేస్తూ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని పార్టీ నాయకులకు సూచించాడట. వచ్చే ఎన్నికల్లో అయినా సత్తా చాటేందుకు ప్రయత్నించాలని సూచించాడు.


Recent Random Post: