పెళ్లి పీఠలు ఎక్కబోతున్న స్టార్‌ హీరోయిన్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రీనా కైఫ్‌ అతి త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతుందా అంటే ఔను అనే సమాధానం ప్రస్తుతం వినిపిస్తుంది. ఆమె మేనేజర్‌ కమ్‌ స్టైలిష్ట్‌ యాష్లె పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న కత్రీనా కైఫ్‌ ఫొటోను షేర్‌ చేసిన యాష్లె ఇది త్వరలో నిజం కావాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్ పెట్టాడు. యాష్లె పెట్టిన పోస్ట్‌ ను షేర్‌ చేసిన కత్రీనా థ్యాంక్యూ చెప్పింది. దాంతో ఆమె త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కడం ఖాయం అని దీన్ని బట్టి అర్థం అవుతుందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

గతంలో ఈమె సల్మాన్ ఖాన్ తో ఆ తర్వాత రణబీర్‌ కపూర్ తో ప్రేమాయణం సాగించింది. అయితే కొన్ని కారణాల వల్ల వారి నుండి బ్రేకప్‌ అయ్యింది. ప్రస్తుతం యంగ్‌ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉంది. వీరిద్దరి మద్య బాండింగ్‌ చాలా దూరం వెళ్లింది. ప్రస్తుతం వీరు ఇద్దరు కలిసి సహజీవనం సాగిస్తున్నరనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సందర్బంగా పెళ్లి గురించి ప్రస్థావన రావడంతో ఖచ్చితంగా వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే అంతా అనుకుంటున్నారు. మరి ఈ జంట పెళ్లి ఎప్పుడు అనేది చూడాలి.


Recent Random Post: