ఫోటోటాక్: రెడ్ హాట్ లో కియారా రంగోళీ

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. గ్లామర్ ఎలివేషన్స్ లో తనదైన మార్క్ వేస్తుంది. ఇన్ స్టా వేదికగా బ్యూటీ హీట్ ని తట్టుకోవడం వీజీ ఏం కాదు. టెంప్టింగ్ ఫోటోలతో యువతలో మంటలు రేపుతుంది. బికినీ..టూపీస్ అంటూ పూల్ అందాల నడుమ చేసే రచ్చ అంతాఇంతా కాదు. రేర్ గా ఆల్ర్టా మోడ్రన్ గాళ్ల్ గానూ కనువిందు చేస్తుంది. చూపరులను ఆకర్షిస్తుంది.

తాజాగా అమ్మడు రెడ్ హాట్ లో ధగధగలాడిపోతున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. మిరుమిట్లు గొలిపే ఔట్ ఫిట్ లో అమ్మడు తళుక్కున మెరిసింది.

డిజైనర్ వేర్ లో క్లివేజ్ అందాలు అంతే హైలైట్ అవుతున్నాయి. రంగులొలిపే ఆ డిజైనర్ పై మ్యాచింగ్ సేమ్ కలర్ రెడ్ కోట్ ధరించింది. ఫేస్ కి లైట్ మ్యాకప్..పెదవులకు పలచగా లిప్ స్టిక్ పూసుకుంది.

బ్యాక్ గ్రౌండ్ లో వాల్ కి రెడ్ కలర్ మ్యాట్ – కియారా ముఖంపై స్పాట్ లైట్ తో టోటల్ రెడ్ మయం అయింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కియారా అందాల్ని ఆస్వాదిస్తూ కామెంట్లు చేయడం చేయడం అభిమానుల వంత్తైంది.

కియారా నటవృత్తి విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆర్ సీ 15లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ సరసన నటించడం రెండవసారి. గతంలో `వినయ విధేయ రామ`లో నటించింది. కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోలేదు. కానీ ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా శంకర్ కియారాని మళ్లీ ఎంపిక చేసారు.

ఇక బాలీవుడ్ లో కియారా వేగంగా గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం`భూల్ బూలైయ్యా-2`- `గోవింద నామ్ మేరా`- `జగ్ జగ్ జియో` చిత్రాల్లో నటిస్తోంది. ఇటవలే ` షేర్షా` సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఆ విజయం అమ్మడికి మరిన్ని కొత్త అవకాశాలు తెచ్చిపెడుతుంది.


Recent Random Post: