బాలా నగర్ ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించే ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి అయ్యింది. నేడు కేటీఆర్ చేతుల మీదుగా ఆ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కేటీఆర్ కు బదులుగా ఆ ప్రై ఓవర్ నిర్మాణం లో రెండు సంవత్సరాలుగా పని చేస్తున్న నిర్మాణ రంగ కూలీ అయిన శివమ్మ రిబ్బన్ కట్ చేసింది. ఆమె వనపర్తి జిల్లాకు చెందిన మహిళ. ప్లై ఓవర్ నిర్మాణం మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె అక్కడ పని చేస్తూనే ఉన్నారు. అందుకే ఆమెకు ప్రారంభోత్సవంకు సంబంధించిన గౌరవం దక్కింది.
ప్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ ముందు ముందు రోడ్ల విస్తరణ మరియు స్కై వేలు రాబోతున్నట్లుగా పేర్కొన్నాడు. నగరంలో ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడం జరిగింది. ముందు ముందు పూర్తి గా ట్రాఫిక్ రహిత నగరంగా హైదరాబాద్ ను మార్చబోతున్నట్లుగా ఆయన అన్నాడు. బాలానగర్ ట్రాఫిక్ కు చెక్ పెట్టిన ఈ కొత్త ప్రై ఓవర్ ఆరు లైన్లతో కిలోమీటరున్నర ఉంటుంది. మొత్తం 26 పిల్లర్లతో 24 మీటర్ల వెడల్పుతో ఈ ప్లై ఓవర్ నిర్మాణం జరిగిందని తెలియజేశారు.
Recent Random Post: