కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. 2019 నుంచి జలజీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో 38లక్షలకు పైగా ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించామని మోదీ చేసిన ప్రకటనపై కేటీఆర్ స్పందించారు.
మిషన్ భగీరధ ద్వారా తెలంగాణలో ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత టీఆర్ఎస్ కే దక్కుతుందని మంత్రి అన్నారు. మిషన్ భగీరధలో కేంద్రం పాత్ర సున్నా అని.. దీనిపై ప్రధాని తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రోజురోజుకీ పెరుగుతున్న పెట్రో ధరలపై మోదీ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. 2014లో కాంగ్రెస్ పెట్రో ధరలు పెంచితే యూపీఏ వైఫల్యం అని ట్వీట్ చేయలేదా..? అని ప్రధాని చేసిన ట్వీట్ ను.. తాము ధరలు పెంచలేదన్న మోదీ ట్వీట్ ను కేటీఆర్ ప్రస్తావించారు. ఎక్కువగా పరిశ్రమలున్న గుజరాత్ లో పవర్ హాలిడే ప్రకటించడాన్ని మోదీ ఎలా సమర్ధిస్తారు..? ఇది డబుల్ ఇంజనా.. ట్రబుల్ ఇంజనా..? అని ప్రశ్నించారు.
Recent Random Post: