లతాజీ హెల్త్‌ బులిటెన్‌.. 12 రోజులు తప్పదు

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆమె వయస్సు 92 సంవత్సరాలు అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దాంతో ఆమెను అత్యవసర సేవల నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ముంబై లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషయమై అభిమానులు మరియు సంగీత ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎట్టకేలకు ఆమె హెల్త్ బులిటెన్ ను ఆసుపత్రి వర్గాల వారు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించిన వైద్యులు పది నుంచి పన్నెండు రోజుల పాటు ఆస్పత్రి లోనే ఉండాలని… వైద్యుల పర్యవేక్షణలో ఆమె ట్రీట్మెంట్‌ తీసుకోవాలని పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం కోసం ఎంతో మంది పూజలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఆమె శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో జాయిన్ అయి ఆరోగ్యవంతంగా ఇంటికి చేరారు. ఈసారి కూడా ఆమె పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం.


Recent Random Post: