కొన్ని కాంబినేషన్లు విన్నంతనే రోమాంచితంగా ఉంటాయి. అలాంటిది.. అలాంటి ప్రాజెక్టులు పట్టాల మీదకు ఎక్కితే ప్రేక్షకులకు పండుగే పండుగ. ఆ మధ్యన మణిరత్నం – మహేశ్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా గురించి చర్చలు జరిగాయన్న మాట వినిపించింది. అనంతరం ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆప్డేట్ ఏదీ బయటకు రాలేదు. అసలీ ప్రాజెక్టు ఎక్కడి వరకు వచ్చింది? ఏం జరుగుతోంది? అన్న క్వశ్చన్ పలువురి అభిమానుల్లో కలుగుతోంది. ఇలాంటివేళ.. దీనికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకున్నారు దర్శక దిగ్గజం మణిరత్నం.
మీడియాలో వచ్చినట్లుగా మహేశ్ తో సినిమాకు సంబంధించిన తాము మాట్లాడుకున్నది నిజమని మణిరత్నం వెల్లడించారు. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన.. మహేశ్ తాను కలిసి మాట్లాడుకున్నామని.. చర్చలు జరిపిన మాట వాస్తవమేనని చెప్పారు. అయితే.. ఆ సమయంలో ఆ ప్రాజెక్టు వర్కువుట్ కాలేదన్నారు.
అనంతరం తామిద్దరం ఇతర పనుల్లో బిజీగా ఉన్నామని పేర్కొన్నారు. ఏమైనా.. కథే డిసైడ్ చేయాలని.. తెలుగు ప్రేక్షకులకు తగిన కథ తన వద్ద ఉందనిపిస్తే.. అప్పుడే నటుల ఎంపిక గురించి ఆలోచిస్తానని.. అందుకు తగ్గట్లు నటుల్ని ఎంపిక చేసుకొని సినిమా చేస్తానని పేర్కొన్నారు. మొత్తంగా అయితే.. మహేశ్ తో సినిమా అయితే లేదన్న విషయాన్ని మణిరత్నం చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
మణిరత్నం మాటల్ని విన్నంతనే నిరాశ కలుగటం ఖాయం. మణిరత్నం నేరుగా తెలుగులో మూవీ చూస్తారన్న ఆశ పడుతున్న వారందరికి ఇది తీవ్ర నిరాశను కలుగజేస్తుంది. అయితే.. అంతో ఇంతో ఊరట కలిగించే ఒక మాట మణిరత్నం నోటి నుంచి వచ్చింది. అదేమంటే.. త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని ఆయన చెప్పారు. నిజంగానే.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఇంతకు మించిన హ్యాపీ న్యూస్ ఇంకేం ఉంటుంది.
Recent Random Post: