భారతీయ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం ఎంత వివాదం రేపిందో తెలిసిన విషయమే. మీడియా పరిధి పెరిగిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ అంశంపై.. మీడియా లేని రోజుల్లో తాను ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను చెప్పుకొచ్చింది బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మల్లికా శెరావత్.
‘మర్డర్’ సినిమా సక్సెస్‌తో వరుస అవకాశాలు అందుకున్నాను. అయితే.. అంతకుమించి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నా కెరీర్ మొదలైన రోజుల్లో ఇప్పుడున్నంత మీడియా అప్పట్లో లేదు. హీరోయిన్ గా రాణించాలంటే హీరోతో గడపటం తప్పనిసరి అనే పరిస్థితులు ఉండేవి. హీరోలతో గడిపేందుకు అంగీకరించలేదని చాలా సినిమాల్లో నన్ను తొలగించారు కూడా. సినిమాలో అవసరం లేకపోయినా బోల్డ్ సీన్లు కావాలనేవారు’.
‘షార్ట్ స్కర్ట్స్ వేసుకుని ముద్దు సీన్‌లో నటిస్తే చెడుగా ప్రచారం చేశారు. ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేసి రియల్ లైఫ్ లో ఎందుకు కుదరదు అంటున్నావు అని అడిగిన హీరోలూ ఉన్నారు. ఇప్పటికీ అటువంటి పరిస్థితులు పరిశ్రమలో ఉన్నాయి. వీటికి దూరంగా ఇప్పుడు లాస్ ఏంజెల్స్‌లో చాలా స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఉంటున్నాను’ అని చెప్పుకొచ్చింది మల్లికా.
Recent Random Post: