స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాకు సిద్దం

త్వరలో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంట్‌ లో అనుసరించాల్సిన వ్యూహాలు మరియు పార్లమెంట్‌ లో లేవనెత్తాల్సిన విషయాల గురించి మాట్లాడటం జరిగింది. పెద్ద ఎత్తున స్టీల్‌ ప్లాంట్‌ మరియు ఇతర ప్రజా సమస్యల గురించి పార్లమెంట్‌ లో టీడీపీ గళం వినిపించాల్సిందిగా ఎంపీలకు చంద్బరాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

పార్లమెంటరీ సమావేశం తర్వాత ఎంపీ రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. పార్లమెంట్‌ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నాడు. అవసరం అయితే స్టీల్ ప్లాంట్‌ కోసం ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ఆయన ప్రకటించాడు. తెలుగు దేశం పార్టీ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపి వేసే వరకు పోరాటం చేస్తుందని రామ్మోహన్‌ నాయుడు అన్నాడు. ఇక వైఎస్ జగన్‌ కు హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న కారణంగా కేసీఆర్ తో నీటి వివాదం విషంయలో ఫైట్‌ చేయలేక పోతున్నాడు అంటూ ఆరోపించారు.


Recent Random Post: