లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్..! అతిథులుగా ఆ ఇద్దరు స్టార్స్..!!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 19 (ఆదివారం) హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ముఖ్య అతిథిలుగా హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

అక్కినేని ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మజిలీ హిట్ తర్వాత నాగచైతన్య సినిమా, శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్ లో ఫిదా సూపర్ హిట్ తర్వాత ఈ సినిమా వస్తూండటంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమాపై నమ్మకంగా ఉన్న చిత్ర యూనిట్ ప్రేక్షకుల్లో హైప్ పెంచేందుకు ఇలా భారీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్ రావు నిర్మాతలు.


Recent Random Post: