చైతూకు అక్కడ కూడా బ్రేకప్‌ చెప్పేసిన సమంత

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు దక్కించుకున్న నాగ చైతన్య మరియు సమంత లు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నట్లు గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరు ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులకు అప్లై చేయడం.. అవి రావడం కూడా జరిగిపోయాయని సమాచారం అందుతోంది. వివాహ బంధానికి విడాకుల ద్వారా గుడ్బై చెప్పేసిన సమంత తాజాగా ఇంస్టాగ్రామ్ లో కూడా నాగ చైతన్య ను అన్‌ ఫాలో అవడంతో స్నేహానికి కూడా గుడ్ బై చెప్పి నట్లు అయింది అంటూ సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది.

నాగచైతన్య మరియు సమంత కలిసి కొద్ది సంవత్సరాలు మాత్రమే వైవాహిక జీవితాన్ని గడిపినా కూడా రాబోయే 10 నుండి 20 సంవత్సరాల వరకు వారు జోడి గురించి జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. సమంత నాగ చైతన్య మళ్లీ కలుస్తారేమో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న జనాలకు తాజాగా సమంత చేసిన అన్ ఫాలో తో ఆశల పై నీళ్లు చల్లినట్లు చేసింది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత మరియు నాగచైతన్య కనీసం స్నేహితులుగా కూడా ఉండే అవకాశం లేదని దీంతో క్లారిటీ వచ్చేసింది.


Recent Random Post: