యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డి ను చీటింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఆయన తాజాగా బెయిల్ పై వచ్చాడు. బెయిల్ పై వచ్చిన నరసింహారెడ్డి సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. నిమిషంన్నర వీడియోను శ్యామల షేర్ చేసింది. అందులో నరసింహారెడ్డి మాట్లాడుతూ కేసుతో తనకు ఏ సంబంధం లేదని అన్నాడు. రెండు మూడు రోజుల్లో పూర్తి నిజాలు బయటకు వస్తాయంటూ ఆయన ధీమా వ్యక్తం చేశాడు. పోలీసులు తనను అరెస్ట్ చేయడం వెనుక కొందరి కుట్ర ఉందని ఆరోపించాడు.
ఇంకా నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. నా గురించి వస్తున్న వార్తలను నమ్మకుండా నాకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నిజాలు తెలుసుకునేలా అందరి ముందుకు నిజాలు తీసుకు వస్తానంటూ చెప్పుకొచ్చాడు. కొన్ని సార్లు నిందలు పడాల్సి వస్తుంది. కాని వాటన్నింటికి ఇప్పుడు కాకున్నా కొన్ని రోజుల తర్వాత అయినా క్లారిటీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. యాంకర్ శ్యామల మరియు నరసింహారెడ్డి ఇటీవల వైకాపా లో జాయ్యారు. ఆ తర్వాత షర్మిలతో కూడా కలిసి వర్క్ చేయాలనుకున్నారు. ఇంతలో ఇలా జరగడం చర్చనీయాశంగా మారింది.
Recent Random Post: