NBK సినిమాని సల్మాన్ ఖాన్‌కి సజెస్ట్ చేసిన ప్ర‌గ్య

Share


ప్ర‌గ్య జైశ్వాల్, టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించడమే కాకుండా, బాలీవుడ్‌లో కూడా అవకాశాలు పొందుతోంది. ఆమె నటించిన సంక్రాంతి హిట్ చిత్రం డాకు మహారాజ్లో గర్భిణి పాత్రలో అద్భుత న‌ట‌నతో ఆకట్టుకుంది, ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది.

తాజా ఇంటర్వ్యూలో, డాకు మహారాజ్ హిందీ రీమేక్‌లో దొంగ పాత్రలో నటించడానికి సరైన నటుడు ఎవరు? అని అడిగినప్పుడు, ప్ర‌గ్య జైశ్వాల్ ఎలాంటి సంకోచం లేకుండా సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ పేరు చెప్పింది. “సల్మాన్ ఖాన్ అద్భుతంగా ఆ పాత్రలో నటిస్తారు. ఆయన గుర్రపు స్వారీ ఎపిసోడ్స్‌లో నిపుణుడు. హార్స్ రైడింగ్ లో అత‌డి ప్రతిభ గొప్పది, ఆయ‌న‌ ఆ పాత్రకు ప్రాణం పోస్తారు” అని ప్ర‌గ్య నమ్మకంగా చెప్పింది.

ఇంతకుముందు, ప్ర‌గ్య జైశ్వాల్ సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కీ భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో కూడా నటించింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించలేదు. మరోవైపు, ఆమె ఎన్బీకేతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజయం అందుకుంది. అయితే కెరీర్ పరంగా ప్ర‌గ్యకు అంతగా ఆశించిన మైలేజ్ తీసుకోలేకపోయింది.

ఇప్పుడు, డాకు మహారాజ్ రూపంలో ప్ర‌గ్యకు మరో హిట్టు వచ్చింది. ఈ సినిమా కూడా సల్మాన్ ఖాన్‌కు రిఫర్ చేయ‌డం ద్వారా ఆమెకు మ‌రొక మంచి అవకాశమివ్వాలని ఆశించారు. ప్రస్తుతం, సల్మాన్ ఖాన్ సికందర్ చిత్రంలో నటిస్తున్నారు, ఇది 2025 ఈద్ సందర్బంగా విడుదల కానుంది. ఈ చిత్రం AR మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది, సాజిద్ నదియాద్‌వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులతో కలిసి నటిస్తున్నారు.


Recent Random Post: