కౌగిలింత భంగిమతో కలకలం సృష్టించిన సిస్టర్స్

సోషల్ మీడియాల్లో శర్మా సిస్టర్స్ దుమారం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఈ భామలిద్దరూ టెంప్టింగ్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్ ని చిల్ చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నారు. ఇటీవల ఓ వాణిజ్య ప్రకటనలోనూ కలిసి బోల్డ్ ప్రదర్శనతో కట్టిపడేశారు. నేహా శర్మ – ఐషా శర్మ భారతదేశంలో బెస్ట్ సిస్టర్స్ గా యువతరం గుండెల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాల్లో లక్షలాదిగా ఫాలోవర్స్ ని పెంచుకున్న సిస్టర్స్ తరచుగా జిమ్ వీడియోలు ఫోటోలను షేర్ చేస్తుంటారు. యోగా సెషన్స్ కి సంబంధించిన వేడెక్కించి ఫోటోలను నిరంతరం ఇన్ స్టా మాధ్యమంగా సిస్టర్స్ షేర్ చేస్తున్నారు. అవన్నీ వైరల్ గా మారుతున్నాయి.

నేహా శర్మ తన సోదరి ఈషాతో మరోసారి మత్తెక్కించే పోజులిచ్చింది. ఆ ఇద్దరూ ఆల్మోస్ట్ హీటెక్కించే భంగిమతో కలకలం సృష్టించారనే చెప్పాలి. నేహా బ్లాక్ అండ్ వైట్ లుక్ లో కనిపించగా.. ఈషా టాప్ టు బాటమ్ బ్లాక్ కలర్ దుస్తులు ధరించింది. ఆల్మోస్ట్ సిస్టర్స్ కౌగిలింత భంగిమతో సర్ ప్రైజ్ చేశారు. వీరిద్దరూ కాళ్లను బంధించి ల్యాప్లో కూర్చుని ఫోజిచ్చారు. కాస్త వింతైనది ఆసక్తిని రేకెత్తించే భంగిమ ఇది. ఇక ఈ ఫోటోలో టోన్డ్ లెగ్స్ సౌందర్యం బయటపడుతోంది.

“మిమ్మల్ని మీరు ప్రశ్నించకుండా వేరొకరి అందాన్ని ఆరాధించండి. ప్రేరణనివ్వండి“ అంటూ ఈ ఫోటోకి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు. సుమారు ఎనిమిది లక్షల లైక్ లను దక్కించుకుంది ఈ ఫోటో. నిజానికి ఇది స్వలింగ సంపర్కుల భంగిమ అనుకోవాలా? అంటూ కొందరు ఈ ఫోటో చూసి సర్ ప్రైజ్ అవ్వగా.. అల్ట్రా మోడ్రన్ సిస్! అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

బిహార్ కి చెందిన జాతీయ కాంగ్రెస్ నాయకుడి కుమార్తెలు నేహాశర్మ-ఐషా శర్మ. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన సిస్టర్స్ రంగుల ప్రపంచంలో రాణించేందుకు తపిస్తున్నారు. అయితే సిస్టర్స్ ఎంతగా ప్రయత్నించిన ఆఫర్లు అంతంత మాత్రమే.

నేహాశర్మ (33) హేరాఫేరీ 3 చిత్రంలో నటిస్తోంది. మహమ్మారీ వల్ల ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. ఇంతకుముందు తానాజీ 3డి లాంటి బ్లాక్ బస్టర్లోనూ చక్కని నటనతో ఆకట్టుకుంది. జోగిరా సారా రారా అనే చిత్రంలో నవాజుద్దీన్ సరసన నేహా నటిస్తోంది. అలాగే తదుపరి పలు వెబ్ సిరీస్ లలోనూ నటించనుంది.

ఇటీవల నేహా శర్మ తన కెరీర్ కంటే సోదరి ఐషా శర్మను హీరోయిన్ గా తీర్చిదిద్దేందుకు చాలానే త్యాగం చేస్తోంది. నిరంతరం మార్గదర్శనం చేస్తోంది. ఇక ఫోటోషూట్లతో అభిమానుల్లోకి దూసుకళ్లడమెలానో టెక్నిక్స్ నేర్పిస్తోంది. బాలీవుడ్ లో ఈ యంగ్ బ్యూటీస్ రాణించేందుకు చేయని ప్రయత్నం లేదు.

ఐషా శర్మ(29) జాన్ అబ్రహాం సరసన ఓ చిత్రంలో నటించింది. తదుపరి వెబ్ సిరీస్ లలోనూ నటించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు శర్మ సిస్టర్స్ సౌత్ కెరీర్ పైనా దృష్టి సారించినా ఎందుకనో సరైన ఆఫర్లు అయితే లేవ్. ఇటీవలి సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్న ఈ భామల ప్రయత్నం ఫలిస్తుందనే భావించాలి.

ఓవైపు డిజిటల్ మరోవైపు వెండితెర .. ఇంకో వైపు బుల్లితెర అవకాశాలిచ్చేందుకు ఎప్పుడూ నవతరం నటీమణులకు అందుబాటులో ఉన్నాయి. కానీ దానిని అందిపుచ్చుకునే చాకచక్యం చాలా ఇంపార్టెంట్. కరోనా మహమ్మారీ వల్ల రెండేళ్లుగా సినిమాల షూటింగుల్లేవ్. సెట్స్ పై పనులు సరిగా జరగలేదు. దీనివల్ల కూడా నేటితరం అవకాశాలు అందుకోవడం కష్టతరమైంది. 2021-22 సీజన్ శర్మ సిస్టర్స్ టైమ్ నడుస్తుందేమో చూడాలి. అలుపెరగని ప్రయత్నం ఫలిస్తే ఇక ఈ భామలకు రంగుల ప్రపంచంలో కనక వర్షమే.


Recent Random Post: