
మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ చూస్తే కుర్ర హీరోలు కూడా తాకట్లేనని అనిపిస్తుంది. వరుస సినిమాలను పూర్తి చేసి బిజీగా ఉన్న చిరు, ఇప్పటికే విశ్వంభర్ మూవీ షూటింగ్‌ను పూర్తి చేశారు. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అనిల్ సినిమాల వేగం మాత్రం అందరికీ తెలుసు.
శంకరవరప్రసాద్ గారు షూటింగ్‌లో ఉన్నప్పటికీ, చిరు ఇప్పుడు మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సిద్దం అయ్యారు. అనిల్ సినిమా తర్వాత మెగాస్టార్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా, శ్రీకాంత్ ఓదెల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. వీటిలో ముందుగా బాబీ సినిమా షూటింగ్ మొదలుపెట్టనుంది.
చిరు కెరీర్లో 158వ సినిమాగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడింది. చిరు-బాబీ కాంబినేషన్‌లో వాల్తేరు వీరయ్య సినిమా సూపర్‌హిట్ కావడంతో, ఈ మూవీపై అభిమానుల అంచనాలు గరిష్టం. బాబీ, మెగా158తో వాల్తేరు వీరయ్యను మించిన హిట్ అందించాలని చూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, మెగా158 సినిమా పూజా కార్యక్రమాలు నవంబర్ 5న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి జరుగనుందని తెలుస్తోంది. ఇక ఫీమేల్ లీడ్ కోసం మేకర్స్ మళయాళ బ్యూటీ మాలవిక మోహనన్తో డిస్కషన్స్ జరుపుతున్నారు.
ఈ వార్తలపై నెటిజన్లు వివిధ రియాక్షన్స్ ఇవ్వడం గమనార్హం. చిరు లాంటి సీనియర్ స్టార్‌తో మాలవిక నటించమని ఒప్పుకుంటుందా అనే ప్రశ్నలు ఉన్నాయి. మరికొందరు మెగాస్టార్‌తో ఛాన్స్ వస్తే వదులుకుంటుందా అని అభిప్రాయపడుతున్నారు. ఇంకా కొందరు, ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నందున, స్క్రీన్‌పై వారి జంట ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మాలవిక ప్రభాస్ సరసన ది రాజా సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
























రాత్రయితే రంకెలు.. | Minister Kollu Ravindra SENSATIONAL COMMENTS on YSRCP Perni Nani
రాత్రయితే రంకెలు.. | Minister Kollu Ravindra SENSATIONAL COMMENTS on YSRCP Perni Nani