ఏపీలో జాబ్ క్యాలెండర్ వివాదం కొనసాగుతోంది. నిరుద్యోగులు లక్షల మంది వెయిట్ చేస్తుంటే కేవలం 10 వేల ఉద్యోగాలను వేయడం ద్వారా జగన్ ప్రభుత్వం ఏం చెబుతోంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఏపీలో ఆందోళన చేస్తున్నారు. మళ్లీ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాల్సిందే అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల పోరాటంకు జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు.
రాష్ట్రంలో మొత్తం 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు మద్దతుగా జిల్లా కేంద్రాల్లో జనసేన పార్టీ ఆందోళనకు దిగబోతున్నట్లుగా జగన్ అన్నాడు. నిరుద్యోగుల కోసం పవన్ పార్టీ పెద్ద పోరాటమే చేయబోతున్నట్లుగా జనసైనికులు అంటున్నారు. కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
Recent Random Post: