జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ.? అని పదే పదే సోషల్ మీడియాలో బులుగు కార్మికులు ప్రశ్నిస్తుంటారు. ఆయన తన సినిమాలతో బిజీగా వున్నారు.. అదే సమయంలో, జనసైనికులకు, జనసేన ముఖ్య నేతలకు ఎప్పటికప్పుడు పార్టీ అధినేతగా దిశానిర్దేశం చేస్తూనే వున్నారు.
పవన్ కళ్యాణ్, జనంలోకి వస్తే.. వైసీపీ ప్రభుత్వం సృష్టించే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అలాగని, పవన్ తాను జనంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళకుండా వుండలేరనుకోండి.. అది వేరే సంగతి. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ సమయం వుంది.. వీలైనంత వేగంగా తాను చేస్తున్న సినిమాలు పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా తన ఫోకస్ రాజకీయాలపై పెట్టనున్నారు పవన్ కళ్యాణ్.
ఈలోగా వీలు చిక్కినప్పుడల్లా పార్టీ తరఫున ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్న పవన్, ఆయా వేదికలపైనుంచి అధికార వైసీపీకి సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు.. ప్రజా సమస్యలపై ప్రభుత్వ పెద్దల్ని కడిగి పారేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, ‘ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి వైసీపీ ప్రమాదకరం..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.
దీనిపై అధికార వైసీపీ నేతలు విలవిల్లాడిపోతున్నారు. ఎలా ప్రమాదకరమంటే.. అంటూ వైసీపీకి జనసైనికులు సోషల్ మీడియా వేదికగా సమాధానమిస్తున్నారు. ‘జగనన్న వున్నాడు జాగ్రత్త..’ అంటూ రాష్ట్రంలో గుంతల రోడ్ల మీద కొందరు బ్యానర్లు కట్టిన వైనాన్ని చూపిస్తూ, ‘ఇందుకే, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి వైసీపీ ప్రమాదకరం’ అని అంటున్నారు.
మద్యం విషయానికొస్తే, మేలైన బ్రాండ్ల మద్యం రాష్ట్రంలో దొరకడంలేదు.. దాని స్థానంలో అంతకన్నా ఎక్కువ ఖరీదు చేసే మద్యం పిచ్చి పిచ్చి బ్రాండ్లతో దొరుకుతోంది. దాని వల్ల తమ ఆరోగ్యం పాడైపోతోందని మందుబాబులే వాపోతున్నారాయె.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్, తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ముందుగా ప్రవేశించింది. అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య తెలంగాణతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌కి (నేరుగా వచ్చేవారు) చాలా తక్కువ. కానీ, ఏపీ ఒమిక్రాన్ తొలి కేసుతో రికార్డులెక్కింది. ఇందుకే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి వైసీపీ పాలన ప్రమాదకరం.. అని జనసైనికులు అంటున్నారు.
చెప్పుకుంటూ పోతే, కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో ఇలాంటి ట్వీట్లు దర్శనమిస్తున్నాయి. వాటిల్లో ఏ ఒక్క దానికీ సమాధానం చెప్పే పరిస్థితుల్లో వైసీపీ లేదు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి వైసీపీ పాలన ప్రమాదకరం అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలట.?
Recent Random Post: