ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో పిల్లలకు ఆన్ లైన్ లో క్లాస్ లు నిర్వహించకుండా ప్రత్యక్ష క్లాస్ లు నిర్వహించడం సబబు కాదు. ఒక వైపు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.. పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇంకా వేయలేదు. ఇప్పుడు వారిని రిస్క్ లో పెట్టే విధంగా క్లాస్ లకు పిలిపించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ పవన్ ప్రశ్నించాడు.
ఇదే సమయంలో వైన్స్ కు టైమ్ ను పెంచడం మరీ విడ్డూరంగా ఉందంటూ పవన్ ఎద్దేవ చేశాడు. పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరుగుతున్నా కూడా ప్రభుత్వం విధి నిర్వాహణ సక్రమంగా చేయడం లేదని పవన్ విమర్శించడు. ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ లు కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలంటూ వారికి స్పీడ్ రికవరి విషెష్ ను అందించాడు. పవన్ ఈమద్య కాలంలో జగన్ ప్రభుత్వం పై పదే పదే విమర్శలు చేస్తూ జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
Recent Random Post: