పొలిటికల్ గొరిల్లా వార్ ఫేర్: జగన్ సర్కార్‌పై జనసేనాని ఫైర్.!

గొరిల్లా వార్ ఫేర్.. అనేది ఓ యుద్ధ తంత్రం.. నక్సలిజం విషయంలో ఈ తరహా పద ప్రయోగాలు వినిపిస్తుంటాయి. ఈ మాట, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట వినిపించడం, అదీ విపక్షాలపై.. అందునా, రాష్ట్రంలో నిరంతరంగా జరుగుతున్న దేవాలయాలపై దాడులకు సంబందించి కావడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది.

ముఖ్యమంత్రి ఇంతటి తీవ్ర పదజాలాన్ని ఎందుకు ఉపయోగించారు.? అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, ముఖ్యమంత్రి నోట వచ్చిన ‘రాజకీయ గొరిల్లా వార్ ఫేర్’ మాటలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి లేఖ రాస్తే, హైకోర్టులో న్యాయమూర్తులు బదిలీ అయిపోతారు.. అంతటి శక్తి వున్న మీపై గెరిల్లా వార్ ఫేర్ చేయడానికి ఎవరు సాహసిస్తారు.? అంటూ సంచలన వ్యాఖ్యలు జనసేనాని నుంచి దూసుకొచ్చాయి.

నిజమే, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, పార్టీ మార్చిన ఇతర ప్రజా ప్రతినిథుల బలంతో అత్యంత బలవంతుడిగా కనిపిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద రాజకీయ గొరిల్లా వార్ ఫేర్ ప్రకటించేంత సీన్ రాష్ట్రంలో ఎవరికీ లేదు. నిజానికి, గతంలో ఏ రాజకీయ ప్రముఖుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఇంకేదన్నా కోణముందా.? అని వైసీపీ శ్రేణులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

గతంలో ‘రాజకీయ వ్యభిచారం’ అనే ప్రస్తావన ప్రముఖంగా వినిపించేది. ఇప్పడేమో, ఈ గొరిల్లా వార్ ఫేర్ అంశం హాట్ టాపిక్‌ అవుతోంది. ముందు ముందు ఇది కూడా సాధారణ ప్రక్రియలా రాజకీయాల్లో మామూలైపోయినా ఆశ్చర్యపోనక్కర్లదేు. 2.6 లక్షల మంది వాలంటీర్లు, బోల్డంతమంది అధికారగణం.. ఇన్నీ వున్నా.. దేవాలయాలకు రక్షణ లేకపోవడమంటే అది ప్రభుత్వ వైఫల్యమేనన్నది జనసేనాని వాదనగా కనిపిస్తోంది.


Recent Random Post: