ప్రధాని నరేంద్ర మోడీ రెండవ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రి వర్గంను ఏర్పాటు చేశారు. మోడీ 2 ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటింది. కాని ఇప్పటి వరకు మంత్రి వర్గ విస్తరణ చేపట్లేదు. కరోనా మహమ్మారి కారణంగా మంత్ర వర్గ విస్తరణ విషయం మరుగున పడిపోయింది. ఎట్టకేలకు ఆశావాహుల కోసం మోడీ మంత్రి వర్గ విస్తరణ ప్రకటన వచ్చినట్లుగా తెలుస్తోంది. కొత్తగా కేంద్ర మంత్రి వర్గంలో 28 మంది చేరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం మంత్రి వర్గ విస్తరణ విషయమై ప్రధాని మోడీ, అమిత్ షా ఇంకా బీజేపీ అధ్యక్షుడు నడ్డా లు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కొత్త మంత్రి వర్గంలో పవన్ కు చోటు కల్పించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అవి పుకార్లు మాత్రమే అని తేలిపోయింది. ప్రస్తుత మంత్రి వర్గంలో 53 మంత్రులు ఉండగా పలువురు ఒకటికి మించిన శాఖలను కలిగి ఉన్నారు. వారికి భారం తగ్గించేందుకు గాను కొత్తగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టబోతున్నట్లుగా నరేంద్ర మోడీ వర్గం చెబుతున్నారు. కొత్త విస్తరణ లో తెలుగు రాష్ట్రాలకు అవకాశం దాదాపుగా లేనట్లే అంటున్నారు.
Recent Random Post: