దేశంలో సంస్కరణలు తీసుకొస్తోంది నయా భారత్ కోసమే కానీ.. ఓటు బ్యాంకు కోసం కాదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ లోని సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చరల్ కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులను ఉద్దేశించి వర్చువల్ సమావేశంలో మాట్లాడారు.
‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రైతుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నాం. యువత కోసం ముద్ర రుణాలు తీసుకొచ్చాం. 200 కోట్ల కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసాం. ప్రతి రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అవినీతిని అంతం చేయగలం. దేశాన్ని సురక్షితంగా ఉంచడమే మా లక్ష్యం. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజల నమ్మకాన్ని పొందేందుకే ప్రయత్నిస్తున్నామ’ని అన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో 5లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తుంటే తెలంగాణకు రాకుండా కేసీఆర్ రానివ్వడం లేదు. రామగుండం ఫ్యాక్టరీ ప్రారంభం కాకుండా కాలుష్యం పేరుతో నోటీసులిచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చాక మతకలహాలు, బాంబు పేలుళ్లు లేవు’ అని అన్నారు.
Recent Random Post: