కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ పదవీ విరమణ చేస్తన్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఆజాద్ గురించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆజాద్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఉద్యోగాలు, పదవులు, అధికారాలు వస్తాయి పోతాయని.. కానీ వాటిని ఎలా నిర్వహించాలో ఆజాద్ ను చూసి నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. తనకు ఆజాద్ ఎంతోకాలంగా తెలుసని.. గుజరాత్ సీఎం కాకముందు నుంచే తాను ఆయనతో మాట్లాడేవాడినని పేర్కొన్నారు.
ఆయన తనకు నిజమైన స్నేహితుడని, ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యుల్లాగానే చూసుకుంటారని మోదీ ప్రశంసించారు. ఇక రాజ్యసభలో ప్రతిపక్ష నేత స్థానాన్ని భర్తీ చేసే నేత లేడన్నారు. పార్టీ కోసమే కాకుండా దేశం కోసం ఆందోళన చెందే వ్యక్తి అని ఆజాద్ ను మోదీ పొగడ్తల్లో ముంచెత్తారు. ఆయన్ను ఎప్పటికీ రిటైర్ కానివ్వబోనని.. ఆజాద్ సలహాలూ, సూచనలు తీసుకుంటామని వెల్లడించారు. సోమవారం రాజ్యసభలో మాట్లాడినప్పుడు కూడా ఆజాద్ పై మోదీ ప్రశంసలు కురిపించారు.
Recent Random Post: