లెడ్ స్పాట్ లైట్ లో జివ్వమనిపించిన జిగేలురాణి

బుట్టబొమ్మ పూజాహెగ్డే ఫ్యాషన్ ఐకానిక్ గాళ్ల్ గా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వెలిగిపోతుంది. ఆల్ర్టా మోడ్రన్ లుక్ లో సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. డిజైనర్ దుస్తుల్లో బుట్టబొమ్మ ఇట్టే ఒదిగిపోతుంది. అందానికి అందం..అవసరం మేర బోల్డ్ టచ్ అప్ తో యువతని ఆకట్టుకోవడం అమ్మడి ప్రత్యేకత. ఇక బీచ్ రిసార్స్ట్ లో బికినీ..టూపీస్ ల్లో పూజా బ్యూటీ ఎలివేషన్స్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.

తాజాగా జిగేలు రాణి లెడ్ స్పాట్ లైట్ లోనూ జివ్వుమనిపిస్తోన్న కొన్ని కెమెరా యాంగిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. నడి రాతిరి బ్యూటీ స్పాట్ లైట్ లో ఇలా బ్లాక్ అండ్ అండ్ బ్యాక్ కాంబినేషన్ డిజైనర్ దుస్తుల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. వైట్ అండ్ బ్లాక్ చుక్కల ప్యాంట్..టాప్ లో ప్యూర్ బ్లాక్ షోల్డెర్ లెస్ ధరించింది. ఇవే దుస్తుల్లో రెండు మూడు ఫోజుల్ని వివిధ భంగిమల్లో ఇచ్చి నెట్టింట వదిలింది. ఆపై ఫ్యాంట్ మ్యాచింగ్ కోట్ ధరించింది మరికొన్నింటిని వదిలి చూపరులను లాక్ చేసింది. పూజా హెగ్డే టోన్డ్ బాడీ లుక్ స్పాట్ లైట్ లో స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ప్రస్తుతం పూజాహెగ్గే `రాధేశ్యామ్` ప్రచారం పనుల్లో నిమగ్నమైంది. హీరో ప్రభాస్ తో కలిసి ప్రచారానికి సహకరిస్తుంది. అందులోభాగంగా డిజైనర్ దుస్తుల్లో బ్యూటీ తళుక్కున మెరుస్తోంది. `రాధేశ్యామ్` పాన్ ఇండియా సినిమా కావడంతో అలంకరణపై ప్రత్యేక
దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. అందరికన్నా సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అయ్యేలా జాగ్రత్త పడుతోంది.

ఇక పూజాహెగ్డే సినిమాల లైనప్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న `ఆచార్య`లో ..పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` లో నటించింది. తొలిసారి ప్రభాస్ తో రొమాన్స్ చేస్తుంది. ఈ రెండు చిత్రాలు అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. ఈ రెండు కూడా బాలీవుడ్ లో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. అలాగే కోలీవుడ్ లో విజయ్ సరసన `బీస్ట్` లో నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో రణవీర్ సింగ్ సరసన `సిర్కస్` లో నటిస్తోంది. రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా మరో రెండు ప్రాజెక్ట్ లకు సైన్ చేసినట్లు సమాచారం.


Recent Random Post: