అరడజను సినిమాలు చేస్తూన్నా పూజా దృష్టి దానిపైనేనట!

టాలీవుడ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం ఈమె తెలుగు లో పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. త్వరలో రాధే శ్యామ్ మరియు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ అమ్మడు మరిన్ని సినిమాలను కూడా చేస్తోంది. ఇదే సమయంలో తమిళంలో సూపర్ స్టార్ విజయ్ తో ఒక సినిమా ను చేసేందుకు కమిట్ అయ్యింది. ఆ సినిమా షూటింగ్ లో త్వరలో జాయిన్ అవ్వబోతుంది. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది. మొత్తం అరడజనుకు పైగా ప్రస్తుతం ఈమె సినిమాల్లో నటిస్తుంది. కాని ఈమె కు మాత్రం ఒక్క సల్మాన్ ఖాన్ తో నటించబోతున్న సినిమాపై మాత్రం ఎక్కువ ఆసక్తి ఉన్నట్లుగా అనిపిస్తుంది.

కరోనా సెకండ్ వేవ్ వచ్చి ఉండకుండా ఉంటే సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ లో పూజా హెగ్డే పాల్గొనేది. ఇప్పటికే చాలా సార్లు సల్మాన్ ఖాన్ తో సినిమా ను చేసేందుకు ఎదురు చూస్తున్నట్లుగా పూజా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. కాని కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుంది. సల్మాన్ ఖాన్ తో ఎన్నో విషయాలు చెప్పాలని ఎదురు చూస్తున్నాను. ఆయన్ను ఎంతగా అభిమానించానో కూడా చెప్పాలనుకుంటున్నట్లుగా పదే పదే ఇంటర్వ్యూల్లో కూడా పూజా హెగ్డే కాస్త అధికంగా ఎగ్జైట్ అవుతోంది.

ఇటీవల కరోనా బారిన పడ్డ పూజా హెగ్డే పూర్తిగా రికవరీ అయ్యింది. అతి త్వరలోనే మళ్లీ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుంది. ఈమె వచ్చే నెలలో సల్మాన్ ఖాన్ సినిమాలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. తమిళ హిట్ మూవీకి రీమేక్ గా రూపొందుతున్న కభీ ఈద్ కభీ దివాళి లో సల్మాన్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. తన అభిమాన హీరో తో నటించబోతున్న నేపథ్యంలో ఇతర సినిమాలు ఏమీ కూడా ఆమెకు కనిపిస్తున్నట్లుగా అనిపించడం లేదు. సల్మాన్ ఖాన్ తో ఈమె చేయబోతున్న సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.


Recent Random Post: