పోసాని ఇంటిపై దాడి.. పాత చింతకాయ పచ్చడి.!

సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటి మీద దాడి జరిగిందట. ఇద్దరు దుండగులు ఆయన ఇంటి మీద రాళ్ళతో దాడి చేశారట. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. దాడి నిజంగా జరిగితే, దోషుల్ని శిక్షించాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

కానీ, అసలు ఇలాంటి ఐడియాలె ఎలా వస్తాయ్.? పోసాని కృష్ణమురళి, పవన్ కళ్యాణ్‌ని తిట్టారు.. పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడ పిల్లల మీద కూడా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. సహజంగానే పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపమొచ్చింది. అంతమాత్రాన, పోసాని కృష్ణమురళి మీద దాడి చేస్తారా.? అభిమానులంతా ఇలా దాడులు చేయడం మొదలు పెడితే, అసలు తెలుగు నాట రాజకీయాలు ఎలా వుంటాయ్.?

సినిమా హీరోల్ని అభిమానులు అభిమానిస్తారు.. అంతే తప్ప, ఇతరుల మీద దాడులు చేయరు. ఏ హీరో అభిమానులైనా అంతే. రాజకీయాల్లో కూడా అంతే. కానీ, కొందరుంటారు.. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. ఆయా పార్టీల కనుసన్నల్లో పనిచేస్తుంటారు. దాడులు చేయడమే వీళ్ళ పని. వీళ్ళకు పని అప్పజెప్పడమే ఆయా రాజకీయ పార్టీల పని. జనసేన లాంటి పార్టీల నుంచి ఇలాంటి దాడులు జరుగుతాయని అనుకోలేం. ఎందుకంటే, రాజకీయ దాడులకు సంబంధించి జనసేన అనేది బాధిత పార్టీ.

జనసేన పార్టీని రాజకీయంగా తొక్కేయాలనే దురాలోచనతో, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి మకిలి అంటించే ప్రయత్నంతో ఇలాంటివి చేస్తుంటారు కొందరు. గతంలో, టీడీపీ అలాగే కాంగ్రెస్ ఈ తరహా రాజకీయాలు ఎక్కువగా చేయిస్తుండేవి. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయిస్తోంది. ఇప్పుడు పోసాని ఇంటిపై జరిగిన దాడి విషయంలోనూ జనసేన శ్రేణులు ఇదే అనుమానం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ దాడి చేయించారని చెప్పించడం వైసీపీ ఉద్దేశ్యం. పవన్ కళ్యాణ్ అభిమానులు ఫోన్లు చేసి వేధిస్తున్నారంటూ వాపోయిన పోసాని కృష్ణమురళి, మీడియా ముందుకు రావడం కన్నా తొలుత పోలీసులను ఆశ్రయిస్తే.. అసలు విషయమేంటో బయటపడిపోయేది. పాత కథ.. పాచిపోయిన కథ.. అందులోంచి మురిగిపోయిన సన్నివేశాలు.. ఇదిగో, ఇళ్ళ మీద దాడులంటూ నికృష్ట రాజకీయాలు. ఇదీ నేటి రాజకీయం.


Recent Random Post: