మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించారు. అన్నట్లుగానే నల్లగొండ పట్టణంలో నిర్వహించిన భారీ కార్యక్రమంలో ఆయన బీఎస్పీలో చేరారు. బీఎస్పీ జాతీయ ఓ ఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ ఆ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే ప్రవీణ్ కుమార్ ను బీఎస్సీ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ గా ప్రకటించారు. రాష్ట్రంలో బీఎస్పీ వ్యవహారాలు అన్ని కూడా ప్రవీణ్ కుమార్ చూసుకోబోతున్నారు.
ఈ సందర్బంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు గిరిజనులు అన్యాయంకు గురి అవుతున్నారు. బహుజనులు బానిసలుగానే బతుకు ఈడుస్తున్నారు. పాలకులుగా మారాలని మారాలని బహుజనులు కోరుకుంటున్నా కూడా తీరడం లేదు. ప్రతి ఒక్కరు కూడా బహుజనుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని అంటున్నారు. కాని ఇప్పటి వరకు బహుజనుల బతుకు మాత్రం మారడం లేదు. ఎందుకు రాష్ట్రంలో ఇంకా దళితులు గిరిజనులు తీవ్ర ఆర్థిక సంక్షోభంను ఎదుర్కొంటున్నారు అంటూ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ లో బీఎస్పీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామంటూ ప్రకటించాడు.
Recent Random Post: