న్యూడ్‌ పిక్‌ అడిగిన నెటిజన్‌ కు ప్రియమణి సమాధానం

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ ల్లో కూడా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ప్రియమణి ప్రస్తుతం బుల్లి తెరపై సందడి చేస్తోంది. అదే సమయంలో వెండి తెరపై కూడా ఆకట్టుకుంటూ ఉంది. సోషల్‌ మీడియాలో ప్రియమణి రెగ్యులర్‌ గా తన హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంది. ఆ సమయంలో అభిమానులు ఆమె అందాన్ని పొగుడుతూ ఉంటే మరి కొందరు ట్రోల్‌ చేస్తూ ఉంటారు. ఇటీవల ప్రియమణి షేర్‌ చేసిన ఫొటోలకు ఒక నెటిజన్‌ స్పందిస్తూ మీ న్యూడ్‌ ఫొటో చూడాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్‌ పెట్టాడు.

ఆ కామెంట్‌ కు ప్రియమణి స్పందించింది. మొదట మీ అమ్మ మరియు అక్క చెల్లి న్యూడ్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయి. ఆ తర్వాత నేను నా ఫొటోలను షేర్‌ చేస్తాను అంటూ కౌంటర్‌ ఇచ్చింది. ప్రియమణి స్పందనతో షాక్‌ అయిన అతడు సారి మేడమ్‌ అంటూ ఆ సంభాషణ నుండి తప్పుకున్నాడు. మొత్తానికి ఈ వ్యవహారం నెట్టింట వైరల్‌ అయ్యింది. ప్రియమణి సమాధానం పై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వెదవలకు అలాగే సమాధానం ఇవ్వాలంటూ ఆమెను అభినందించారు.


Recent Random Post: