కాంగ్రెస్ ప్రచారంలో ప్రియాంక.. టీ తోటల్లో కార్మికురాలిగా..

కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవానికి ప్రియాంక, రాహుల్ శక్తి మేర కృషి చేస్తున్నారు. ఈమేరకు రాహుల్ తమిళనాడులో పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రియాంక అసోం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆమె స్థానిక మహిళలు, కార్మికులు, రైతులను నేరుగా కలుసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా అసోంలోని బిశ్వనాథ్‌లో టీ గార్డెన్ కార్మికులతో ప్రియాంక కలిసిపోయారు.

కార్మికురాలిగా మారి టీ ఆకులను కోసారు. అచ్చ తేయాకు కార్మికురాలిలా నుదుటికి బ్యాండ్, నడుముకు అప్రాన్‌ కట్టుకుని, వీపుపై బుట్ట పెట్టుకుని కార్మికులతో ముచ్చటిస్తూ అందులో టీ ఆకులు వేసారు. ‘మీ భయాలు పోగొట్టి కలలు సాకారమయ్యేందకు కృషి చేస్తాం. కార్మికుల నిరాడంబర జీవితం, శ్రమ ఆకట్టుకుందని అన్నారు. వారు కష్టించే విధానం, పనితీరు తెలుసుకున్నాను. నాపై వారు చూపించిన అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను’ అని ఆమె ట్వీట్‌ చేశారు. అసోంలోని సుమారు 35 నియోజకవర్గాల్లో తేయాకు కార్మికులు పార్టీల భవితవ్య్యాన్ని నిర్దేశిస్తారు.


Recent Random Post: