బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళం హిందీ బెంగాలీ మరాఠీలతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. మహరాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ ముందుగా స్టేజీ ఆర్టిస్ట్ గా పలు ప్రయోగాత్మక నాటకాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమాల మీద ఆసక్తితో లండన్ వెళ్లి డ్యాన్స్ నేర్చుకున్న రాధికా ఆప్టే ముందుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. తన బోల్డ్ మాటలు.. ముక్కుసూటిగా మాట్లాడే తత్వంతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ బ్యూటీ తెలుగులోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్తచరిత్ర’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది రాధిక. ఆ తర్వాత ‘ధోని’ ‘రక్తచరిత్ర 2’ ‘లెజెండ్’ ‘లయన్’ ‘కబాలి’ లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. వీటితో పాటు ‘బద్లాపూర్’ ‘హంటర్’ ‘ఫోబియా’ ‘సాక్రెడ్ గేమ్స్’ ‘అహల్య’ ‘ప్యాడ్ మ్యాన్’ ‘లస్ట్ స్టోరీస్’ వంటి సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో రీసెంటుగా ఓటీటీలో విడుదలైన ”రాత్ అకేళీ హై” చిత్రం ద్వారా మరో సక్సెస్ వెనకేసుకుంది. టాలెంటెడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీకి పోటీగా నటించి ఓటీటీ ఆడియన్స్ ని మెప్పించింది. ఈ నేపథ్యంలో అటు సిల్వర్ స్క్రీన్ పై ఇటు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లలో కూడా సత్తా చాటుతోంది రాధికా ఆప్టే.
కాగా ప్రస్తుతం చాలా మంది స్టార్ హీరోయిన్స్ వెబ్ వరల్డ్ లో అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ హవా ఇలానే కొనసాగబోతోందని భావించి అందరూ వెబ్ సిరీస్ మరియు ఒరిజినల్ మూవీస్ లలో నటించడానికి ముందొస్తున్నారు. అయితే ఎంతమంది వచ్చినా ఓటీటీలలో రాధికా ఆప్టే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీలు సైతం ఈ బ్యూటీతో పలు ప్రాజెక్ట్స్ కోసం ముందుగానే డీల్స్ కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమంలో రాధిక ఒక్కో వెబ్ సిరీస్ కి దాదాపు రూ. 50 లక్షలు నుంచి రూ. 2 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. అటు సినిమాల్లో కూడా అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఏదేమైనా ఓటీటీలలో మాత్రం రాధికా ఆప్టే కొట్టేవారు లేరని చెప్పవచ్చు.
Recent Random Post: